



ఖమ్మం నగరంలో ఈరోజు మంజు బ్యానర్‌పై, పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ‘మగువ’ అనే కొత్త టెలివిజన్ సీరియల్‌కు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ— మహిళా శక్తి, కుటుంబ విలువలు, సామాజిక అంశాలతో సాగనున్న ఈ సీరియల్ ప్రేక్షకుల హృదయాలను తట్టుకునేలా రూపొందిస్తున్నామని తెలిపారు.
సీరియల్ కథలో మహిళ ఓటమిని కాదు – ఆత్మవిశ్వాసాన్ని, ఎదుగుదలను, కుటుంబానికి అండగా నిలిచే శక్తిని చూపించబోతున్నామని చెప్పారు. ఖమ్మంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కళాకారులు, సాంకేతిక నిపుణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
‘మగువ’ సీరియల్ త్వరలో టెలివిజన్ ప్రేక్షకుల ముందుకు రానుందని, కుటుంబ విలువలను ప్రతిబింబించేలా ప్రతి ఎపిసోడ్‌ను నాణ్యతతో తెరకెక్కిస్తున్నామని పవర్ వినయ్ ఎంటర్టైన్మెంట్ టీమ్ పేర్కొంది.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird