Home అంతర్జాతీయ భారీ డిస్కౌంట్‌తో రష్యా చమురు -VRM MEDIA

భారీ డిస్కౌంట్‌తో రష్యా చమురు -VRM MEDIA

by VRM Media
0 comments
భారీ డిస్కౌంట్‌తో రష్యా చమురు


మాస్కో: రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు విధించడంతో భారత్ కు భారీ డిస్కౌంట్‌తో ఆయిల్ విక్రయించేందుకు రష్యా సిద్ధమైంది. రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌లపై అమెరికా విధించిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. దీంతో క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఫలితంగా రష్యా నుంచి భారత్‌కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. దీనితో రష్యా ప్రధాన చమురు ఉరల్స్‌ను డెలివరీ ఆధారంగా బ్రెంట్ ముడి చమురు కంటే బ్యారెల్‌కు ఏడు డాలర్ల వరకు తగ్గింపుతో భారత రిఫైనరీలకు రష్యా సిద్ధమైంది. ఆంక్షలు లేనప్పుడు ఈ తగ్గింపు మూడు డాలర్లుగా ఉండగా, ఇప్పుడు రెండింతలు అయింది. తాజా తగ్గింపు ధరతో వచ్చే చమురు డిసెంబర్ నెలలో లోడ్ అయి జనవరిలో భారత్‌కు చేరే అవకాశం ఉంది.

మా అమ్మ బతికే ఉంది: సీఎం రమేశ్
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,820 Views

You may also like

Leave a Comment