


VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 27
ఒంటిమిట్ట అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని, మొన్నటి జడ్పిటిసి ఉప ఎన్నికల్లో ప్రజలు ఆదరించినట్లుగానే రాబోయే అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని రాజంపేట టిడిపి ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
గురువారం ఒంటిమిట్ట మండలం నందు తెలుగు తమ్ముళ్ళతో కలిసి అట్టహాసంగా నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని చమర్తి జగన్మోహన్ రాజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ ఆనాడు కీర్తిశేషులు ఎన్టీ రామారావు 1983లో పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం పార్టీకి కార్యకర్తలే బలం అనే నినాదంతో పార్టీని స్థాపించారు.
నేడు అదే స్ఫూర్తితో మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముకని అలాగే ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమం అందేలా కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అంతేకాకుండా రాజంపేట నియోజకవర్గంలో 6 మండల కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల్లో ప్రజలకు నాయకులు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహా రెడ్డి, జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ఒంటిమిట్ట టిడిపి మండల ప్రధాన కార్యదర్శి. ఆలూరి వెంకటసుబ్బయ్య. మండల్ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మగుంట్ల ఈశ్వరయ్య. మండల్ కోఆర్డినేటర్ కట్ట సుబ్బరాయుడు. క్లాస్ వన్ కాంట్రాక్టర్ కరెంటు రమణ, బొబ్బిలి రాయుడు, తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మీనుగా రమణ. ఏ వెంకటసుబ్బయ్య, గజ్జల శ్రీనివాసులు. రెడ్డి. చంద్రపాల్. చిన్న బాబు. పెన్న పేరూరు సర్పంచ్. బి లక్ష్మీ నరసయ్య. నర్వ కాటిపల్లి మాజీ ఎంపీటీసీ నరసింహులు.. నరవకాటి పల్లి మాజీ ఉపసర్పంచ్ నాగరాజు. గఫూర్ ఖాన్. నర్వక్కటి పల్లి మాజీ సర్పంచ్. వెంకటసుబ్బయ్య. మల్లేష్ యాదవ్.కే సుబ్బరాయుడు,సాలాబాద్ బుజ్జి, రోశయ్య. ఎంవి రమణ, టి ఈశ్వరయ్య, జి శ్రీనివాసరెడ్డి, మౌలాలి, నరసింహులు, సురేష్ రాజు, రాజశేఖర్ యాదవ్, మల్లేష్ యాదవ్, సీఐ సీఐ నరసింహారాజు. ఎస్సై ప్రణయ్ కుమార్ రెడ్డి కానిస్టేబుల్స్. బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird