
ఎంత చేసినా ఇంకా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని ఉంది
తాజా మాజీ సర్పంచ్ మేడి రవి
వి ఆర్ ఎం న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: నవంబర్,27.మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లి గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ మేడి రవి మాట్లాడుతూ, గతంలో మా యొక్క గ్రామ ప్రజలు
నన్ను ఆధరించి ఎంపీటీసీ గా ఒకసారి గెలిపించారని, ఆ తర్వాత మళ్లీ సర్పంచిగా గెలిపించిన అనంతరం నా గ్రామ అభివృద్ధికి,యువత చైతన్యం కోసం నావంతు గా ఎంతో కృషి చేయడం జరిగిందని అన్నారు. నేను ఎంత చేసినా ఇంకా గ్రామ అభివృద్ధికి తోడుపడాలని నా ఆకాంక్ష నెరవేరాకున్నదని, స్థానిక సంస్థల ఎన్నికల లో భాగంగా గ్రామ సర్పంచ్ రిజర్వేషన్ దళిత మహిళకు రావడం సంతోషమని ఆయన అన్నారు, ఈ నేపథ్యంలో గ్రామ అభివృద్ధికి తోడు పడాలనే లక్ష్యంతో ఉన్నానని, ప్రజలు మరో మారు కోరుకుని ఆదరిస్తే నాయొక్క సతీమణి ధనలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆదరించి గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు, అభిమానులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.