
VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస రాథోడ్
కల్లూరు మండలం, పేరువంచ గ్రామ పంచాయతీలో రాజకీయం రసవత్తరంగా మారింది.సర్పంచ్ అభ్యర్థిగా మాజీ ఖమ్మం జిల్లా ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ కొండపల్లి వాసు బరిలో దిగనున్నారు. ఇప్పటికే ఆయన అనుచరులు కార్యాచరణ ప్రారంభించారు. మొదటి నుండి రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడంతో పార్టీలకు అతీతంగా గ్రామస్థులు కొండపల్లి వాసు కు మద్దతుగా నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
సర్ధార్ జలగం వెంగళ రావు తో రాజకీయ ప్రస్థానం
దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత సర్ధార్ జలగం వెంగళ రావు తో కొండపల్లి జోగారావు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ జలగం కుటుంబానికి వీర విధేయులుగా రాజకీయాల్లో కొనసాగుతూ వచ్చారు. పేరువంచ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొండపల్లి జోగారావు రెండు దశబ్దాల కాలంగా పని చేశారు. అనంతరం ఆయన కుమారులు కొండపల్లి రాధ కృష్ణ, కొండపల్లి వాసు లు జలగం వెంగళ రావు తరువాత ఆయన కుమారులు జలగం ప్రసాద రావు, జలగం వెంకటరావు వెంట నడిచారు. అనంతరం జలగం వెంకటరావు తో పాటు నాటి టి ఆర్ ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.2013 సం.లో తన అనుచరుడు మట్టెల రమేష్, తరువాత వాసు గారి తల్లి 2014 సం లో కొండపల్లి ఇందిరమ్మ ను స్వతంత్ర అభ్యర్థిగాని లబెట్టి కాంగ్రెస్, తెరాస అభ్యర్థులపై గెలుపొందారు.2019 సం లో కొండపల్లి వాసు కూడా ఆనాటి తెరాస, కాంగ్రెస్ అభ్యర్థుల పై స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు.2023 లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాఘమయి గెలుపుకు కృషి చేశారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird