ప్రత్తిపాడు VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 26:–
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ డి. సునీత అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగం అనేది భారత దేశ అత్యున్నత చట్టమని, దేశ పరిపాలన,ప్రభుత్వ వ్యవస్థ, ప్రాథమిక హక్కులు బాధ్యతలు మొదలైన వాటిని నిర్దేశిస్తుందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రయాగమూర్తి ప్రగాఢ, అధ్యాపకులు శివప్రసాద్,వెంకటేశ్వరరావు, వి రామారావు,కే శ్రీలక్ష్మి,కే.బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.