
సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 27 (ఈవార్తలు): తెలంగాణ గ్రూప్ 2 (2015) వివాదంపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రధాన హైకోర్టు న్యాయమూర్తి (సీజే) అనుమతిని ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుతో గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించింది. 2015-16లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వైట్ నర్, దిద్దుబాటు ఉన్న జవాబు పత్రాలను మూల్యాంకనం చేసినట్లు టీజీపీఎస్సీపై ఆరోపణలు చేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం.. గ్రూప్ 2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేసింది. ఈ తీర్పుపై టీజీపీఎస్సీ మరోమారు హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయమూర్తి ధర్మాసనం విచారించి తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది.
రంజుగా కర్నాటకం!
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్