కల్లూరు: కల్లూరు మండలంలో చైర్మన్ నీరజ ప్రభాకర్ చౌదరి నూతన గృహ ప్రవేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగామయి దయానంద్ హాజరై గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగామయి దయానంద్ మాట్లాడుతూ— ప్రజలకు సేవ చేయడంలో ముందుండే నీరజ ప్రభాకర్ చౌదరి గారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అభివృద్ధే తమ లక్ష్యం అని అన్నారు. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.