
సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 28
సిద్దవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో, రాజంపేట రెవిన్యూ డివిజన్ లో కలపవద్దని కడప జిల్లాలో కడప రెవిన్యూ డివిజన్ లో కొనసాగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాజ్యసభ సభ్యులు మేడా రఘునాధ్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం సిద్దవటం మండల వైసీపీ నాయకులు కడప జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. కలెక్టర్ ను కలిసిన వారిలో వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, మండల కన్వినర్ నీలకంఠా రెడ్డి, జెట్పీటీసి సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి పల్లె సుబ్బరామి రెడ్డి, వావిళ్ల శ్రీనివాసులు రెడ్డి, యువ నాయకులు ఆలం క్రిష్ణ చైతన్య, కుప్పం సుబ్బారెడ్డి, అన్నమయ్య జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కోటపాటి పెంచలయ్య, నిమ్మకాయల ప్రసాద్ రెడ్డి, వై.ఎస్.ఆర్.టీ.యూ.సీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు బత్తల భక్తుడు, మండల బీసీ సెల్ అధ్యక్షులు నాయకులు యల్లయ్య తదితరులు ఉన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird