Home ఎంటర్‌టెయిన్మెంట్ ‘అఖండ2’ బాలయ్య విశ్వరూపం.. పండగ చేసుకుంటున్న అభిమానులు! – VRM MEDIA

‘అఖండ2’ బాలయ్య విశ్వరూపం.. పండగ చేసుకుంటున్న అభిమానులు! – VRM MEDIA

by VRM Media
0 comments
'అఖండ2' బాలయ్య విశ్వరూపం.. పండగ చేసుకుంటున్న అభిమానులు!



నందమూరి అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్న ‘అఖండ2 తాండవం’ రిలీజ్ దగ్గరికి వచ్చేసింది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా ఎంతో గ్రాండ్‌గా చేస్తారు. అఖండ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు రాబోతున్న అఖండ2 చిత్రం మించే స్థాయిలో ఉందని ఇప్పటివరకు విడుదలైన గ్లింప్స్‌, టీజర్ వంటి వాటి ద్వారా వాటిని చూపుతుంది. డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా మూవీగా ‘అఖండ2’ రిలీజ్‌ కాబోతోంది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ టీజర్‌ను విడుదల చేశారు. అఘోరాగా బాలయ్య నట విశ్వరూపం ఈ టీజర్‌లో మరింత విస్తృతంగా కనిపించింది. బోయపాటి టేకింగ్‌, దానికి తగినట్టుగానే థమన్‌ అదిరిపోయే మ్యూజిక్‌తో టీజర్‌ దద్దరిల్లిపోయింది. బాలయ్య పవర్‌ ఫుల్‌ డైలాగులు, కొత్తగా అనిపించే ఫైట్స్‌ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేస్తున్నారు.
తాజాగా విడుదల అయిన టీజర్‌లో ఆకట్టుకునే అంశాలు చాలా ఉన్నాయి. అతను చెడుతో పోరాడాడు, దానిని నాశనం చేస్తాడు అంటూ బాలయ్య క్యారెక్టర్‌ ఎలివేట్‌ చేసే సన్నివేశాలు సినిమాలో చాలా ఉన్నట్టుగా ఈ టీజర్‌ చూస్తే అర్థమవుతుంది.

‘భారత్‌ని కొట్టాలంటే అక్కడి మూలాలను అడ్డంపెట్టుకునే కొట్టాలి’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ‘అఖండ 2’ టీజర్‌ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంది. అఘోరాగా బాలయ్య తన నట విశ్వరూపం చూపించారు. ‘కొండల్లో తొండలు తిని బ్రతికే మీరెక్కడ.. ప్రతీ కొండని క్షేత్రంగా మార్చి పూజించే మేమెక్కడ’ అనే డైలాగ్‌ డెఫినెట్‌గా థియేటర్‌లో చప్పట్లు కొట్టిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రామ్‌లక్షణ్‌ కంపోజ్‌ చేసిన ఫైట్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. తన విన్యాసాలు ఆంజనేయుడ్ని కూడా చూపించడం ఆ యాక్షన్‌లో చూపించడం విశేషం. డెఫినెట్‌గా బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌ మరోసారి సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందని టీజర్‌ ప్రూవ్‌ చేసింది.

2,810 Views

You may also like

Leave a Comment