Home తెలంగాణ కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కండ్ల ముందే షాపులన్నీ దగ్ధం – VRM MEDIA

కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కండ్ల ముందే షాపులన్నీ దగ్ధం – VRM MEDIA

by VRM Media
0 comments
కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కండ్ల ముందే షాపులన్నీ దగ్ధం


వరుసపెట్టి 10 బొమ్మల షాపులు దగ్ధం

జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలు

బోరున విలపిస్తున్న బాధితులు

మల్యాల, నవంబర్ 29 (ఈవార్తలు): జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలో శనివారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దిగువ కొండగట్టులోని జగిత్యాల-కరీంనగర్ హైవే పక్కన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఎదురుగా ఉన్న సందులోని బొమ్మల షాపులన్నీ కాలిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో దాదాపు 10 షాపులు కనిపిస్తున్నాయి. ఈ భారీ చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బొమ్మలన్నీ ప్లాస్టిక్ వస్తువులు, వెదురు బొంగుల పందిళ్లు కావడంతో మంటలు వేగంగా వ్యాపించినట్లు. అందిన సమాచారం మేరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఒక్కసారిగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో స్థానికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అయితే, జీవనోపాధి కోల్పోవడంతో బాధిత కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. కడుపు నింపే దుకాణం కండ్ల ముందే కాలిపోతోందని కన్నీరుమున్నీరయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఫ్లయింగ్ స్క్వాడ్స్ అప్రమత్తంగా ఉండాలి
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,816 Views

You may also like

Leave a Comment