
ప్రత్తిపాడు వి.ఆర్.ఎం.మీడియా
న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 7:–
కార్తీక పౌర్ణమి సందర్భంగా కిర్లంపూడి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఉమా వైద్యనాధేశ్వర స్వామి ఆలయంలో వైద్యనాథేశ్వర స్వామిని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు దంపతులు దర్శించుకున్నారు. వైద్యనాధేశ్వర స్వామిని పల్లకిలో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి జ్వాలా తోరణం కార్యక్రమాన్ని గిరిబాబు పల్లకి సేవలో ప్రారంభించారు. గిరిబాబు మాట్లాడుతూ కార్తీక మాసం లో పవిత్ర దినంగా జరుపుకునే పౌర్ణమి రోజున జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ సభ్యులను సహకారాన్ని అందించిన ప్రతి అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలని గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో కిర్లంపూడి గ్రామానికి ప్రత్యేకత ఉందన్నారు. ఉమా వైద్యనాధేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird