Home వార్తలుఖమ్మం సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి ఖమ్మం

సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలి, టీచర్లకు హెల్త్ కార్డు *ద్వారా ఉచిత వైద్యం అందించాలి.
ప్రధానోపాధ్యాయుల సమావేశాలు జిల్లా కేంద్రంలో నిర్వహించటం తగ్గించాలి, టిఎస్ యు టి ఎఫ్ బోనకల్

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టి ఎస్ యు టి ఎఫ్ సంఘ నిర్మాణంలో భాగంగా శుక్రవారం నాడు బోనకల్ మండల కేంద్రంలో మూడు కాంప్లెక్స్ కమిటీల ఎన్నికలను ఏకగ్రీవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు. రామకృష్ణ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంబద్ధంగా ఉందని, వెంటనే సమీక్షించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 22 లక్షల టీచర్లు తెలంగాణ రాష్ట్రంలో 32,000 మంది టీచర్లు ఇబ్బందులకు గురవుతున్నారని, కావున కేంద్ర విద్యా శాఖ స్పందించి వెంటనే విద్యాహక్కు చట్టంలోని 23వ క్లాసుని మార్చి విద్యా హక్కు చట్టం అమలైన తేదీ నుంచే టెట్ వర్తించే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని టీఎస్ యుటిఎఫ్, ఆల్ ఇండియా సంఘం ఎస్ టి ఎఫ్ ఐ డిమాండ్ చేస్తుందని, ఆమేరకు ఎస్ టి ఎఫ్ ఐ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వెయ్యమని యుటిఎఫ్ గా డిమాండ్ చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ వేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను నాయకత్వం కలిసిందన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీకి మరియు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల జేఏసీకి ఇచ్చిన హామీ నిలబెట్టుకుని ఉద్యోగులకు హెల్త్ కార్డు పై ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు బకాయిపడిన డిఎ లను వెంటనే ఇవ్వాలని, పి ఆర్ సి నివేదికను వెలువరించి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపి ఆమోదయోగమైన పిఆర్సి వర్తింపజేయాలని మరియు రాష్ట్ర ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకొని సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు టైం టేబుల్ మార్పుతో పాటు కేర్ టేకర్ ను నియమించాలని, కేజీబీవీ & యు ఆర్ ఎస్ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనం ఇచ్చి సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తూ జీతాలు పెంచాలని, బేసిక్ ఇవ్వాలని, మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు 010 హెడ్ కింద జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయుల సమావేశాలను ఎక్కువ శాతం మండల కేంద్రాలలో ఏర్పాటు చేసే విధంగా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆన్లైన్లో సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు ఈకార్యక్రమంలో మండలం అధ్యక్షులు చిన్న రంగారావు, జిల్లా నాయకులు సద్దా బాబు, మండల ఉపాధ్యక్షులు పి గోపాలరావు, మండల కార్యదర్శులు పి. నరసింహారావు, బి.నిర్మల, చిట్యాల. కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు యోహాన్, జానకీ పురం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, భాషాబ్రహ్మం, వెంకన్న, నరేంద్ర సింహ బానోత్ రమేష్, అరుణ కుమారి, గంగాభవాని తదితరులు పాల్గొన్నారు .

*కాంప్లెక్స్ కమిటీలు ఎన్నిక ఏకగ్రీవం
బోనకల్ కాంప్లెక్స్ కమిటీ కన్వీనరు రేఖం. శ్రీను
కో కన్వీనర్ కే. పద్మావతి,
జానకిపురం కాంప్లెక్స్ కన్వీనర్ గా జి .శ్రీనివాసరావు
కో కన్వీనర్ గా గంగుల .పావని
కలకోట కాంప్లెక్స్ కన్వీనర్ గా ఎం. లవ కుశ
కో కన్వీనర్ గా నసీమా సుల్తానా ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది

2,840 Views

You may also like

Leave a Comment