Home ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్ట్ అధికారి వారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మట్ట మెహర్ బాబా గౌడు

ప్రాజెక్ట్ అధికారి వారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మట్ట మెహర్ బాబా గౌడు

by VRM Media
0 comments

దేవిపట్నం ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం జాతీయ మానవ హక్కుల సంఘం ఏ ఎస్ ఆర్ జిల్లా అధ్యక్షులు మట్టా మెహర్ బాబా గౌడు, మరియు జిల్లా గౌడ్ సంఘం యువజన అధ్యక్షులు రేలంగి రాంబాబు గౌడు శనివారం రంపచోడవరం ఐటిడిఏ క్యాంపు కార్యాలయం నందు ప్రాజెక్ట్ అధికారి స్మరణ్ రాజ్, మరియు డి.ఎస్.పి సాయి ప్రశాంత్ ఇరువురిని మానవ హక్కుల సంఘం అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మర్యాదపూర్వకం వారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో స్మరణ్ రాజ్ మాట్లాడుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మానవ హక్కుల పరిరక్షణకు మా వంతు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. అలాగే రంపచోడవరం డిఎస్పి సాయి ప్రశాంత్ మాట్లాడుతూ న్యాయపోరాటం వైపు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటాదని ఈ సందర్భంగా తెలియజేశారు. మట్టా మెహర్ బాబు గౌడు మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కోసం ఐక్య రాజ్యసమితి అందరికి స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అందేలా ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చిందన్నారు. ప్రస్తుతం మానవ హక్కులపై జరుగుతున్న దాడులు పైన ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని పరిరక్షించుకోవటం కోసం, కోల్పోతున్న హక్కులను పునరుద్ధరణ కోసం పోరాటాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.

2,850 Views

You may also like

Leave a Comment