VRM అయినవిల్లి భద్రం అయినవిల్లి భద్రం అన్న సమారాధన కార్యక్రమానికి 300 కిలోల బియ్యం, 50 వేలు రూపాయలు విరాళం
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం కణుపూరు గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు
తొలిత ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు బాణసంచా కాల్పులతో, పూల వర్షం కురిపిస్తూ, ఘన స్వాగతం పలికి, శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు.
ఆలయలో స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని, భక్తులకు తీర్థ ప్రసాదాలు వడ్డించారు.
అన్న సమారాధన కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు గారు 300 కీలోల బియ్యం, 50 వేలు రూపాయలు విరాళంగా అందజేశారు.
గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందిస్తానని అన్నారు.
అలాగే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుని, ఆమె భర్త గర్భిణిగా ఉన్న ఆమెను వదిలి వెళ్లిపోయాడు.
ఆమె పరిస్థితిని చూసి చలించి పోయిన కంబాల శ్రీనివాసరావు గారు ఖర్చులకు ఆమెకు 2,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి, డెలివరీ అయ్యేంతవరకు వైద్య ఖర్చులు తానే భరిస్తానని ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.