Home వార్తలుఖమ్మం పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

by VRM Media
0 comments

ది.16.11.2025
కారేపల్లి పోలీస్ స్టేషన్ ఖమ్మం…

Vrm Media కారేపల్లి ప్రతినిధి

ఐదుగురి పై కేసు నమోదు

రూ.23500 నగదు, 3సెల్ ఫోన్లు, బైక్ స్వాధీనం

…..కారేపల్లి ఎస్ఐ గోపి

పేకాట ఆడుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు కారేపల్లి మండలంలోని సూర్యా తండా గ్రామ శివారులో పేకాట స్థావరంపై కారేపల్లి పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించడం జరిగిందని కారేపల్లి ఎస్సై గోపి తెలిపారు.
పేకాట ఆడుతున్న వారి నుంచి రూ.23500 నగదు, మూడు సెల్ ఫోన్లు, ఒక బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న వారిలో ఇద్దరు పరార్ కాగా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. పేకాట ఆడుతున్న వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.ఈ దాడుల్లో ఎస్ఐ తో పాటు పోలీస్ సిబ్బంది ఓంకార్, వెంకన్న, సైదులు పాల్గొన్నారు. పి ఆర్ వో

2,830 Views

You may also like

Leave a Comment