[ad_1]
కూతురిని చంపిన తండ్రి
కొనఊపిరితో కొడుకు
కరీంనగర్లో ఘటన
వావిలాలపల్లి/కరీంనగర్, నవంబర్ 16 (ఈవార్తలు): కరీంనగర్ వావిలాలపల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు(17), కూతురు(15)ను గొంతు నులిమి చంపేందుకు తండ్రి యత్నించాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన మృతి చెందగా.. కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉంది. తండ్రి మల్లేశం పరారయ్యాడు. పని మీద బయటకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న పిల్లలిద్దరినీ గమనించిన తల్లి పోచమ్మ ఆసుపత్రిలో చేర్చింది. వీళ్ళిద్దరికీ మానసిక అంగవైకల్యంతో ఉండటం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వస్థలం మంచిర్యాల వీరి దండేపల్లి మండలం వెంకటరావుపేట కాగా.. గత ఏడేళ్ల నుంచి కరీంనగర్ వావిలాలపల్లిలో మల్లెశం కుటుంబం కిరాయికి ఉంటుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్
[ad_2]
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird