
రాజ్యాంగబద్ధంగా 42 శాతం మా హక్కు
హైదరాబాద్ న్యాయసాధన దీక్షలో ఆర్ కృష్ణయ్య
ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్‌లో దీక్ష
ఇందిరాపార్క్/హైదరాబాద్, నవంబర్ 16 (ఈవార్తలు): పార్టీపరంగా తమకు రిజర్వేషన్లు అవసరం లేదని, రాజ్యాంగబద్ధంగా వచ్చే రిజర్వేషన్లే బీసీలకు కావాలని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌లో ఆయన నిరసన ఆదివారం జరిగింది ‘బీసీ రిజర్వేషన్ల సాధన దీక్ష’కు బీసీ సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున నాయకులు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ కులాలకు రాజకీయంగా తక్కువగా ఉందని చెప్పారు. ప్రభుత్వం కచ్చితమైన జనాభా లెక్కలు సమర్పిస్తే 42 శాతం రిజర్వేషన్ న్యాయపరంగా సాధ్యమేనని చెప్పారు. కోర్టులు కూడా సమగ్ర డేటా ఆధారంగా రిజర్వేషన్ పెంపును అని అన్నారు. దీక్షకు అధ్యక్షత వహించిన బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రామాణిక పద్ధతులు పాటిస్తే 42 శాతం మాత్రమే కాదు, 52 శాతం రిజర్వేషన్లు కూడా అమలుచేయొచ్చని పేర్కొన్నారు. ‘డేటా బలంగా ఉంటే మంచి అవరోధాలు తగ్గుతాయి’ అని. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్ పెంపును అమలుచేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీక్ష సమయంలో ఇందిరా పార్క్ బీసీ రిజర్వేషన్ల నినాదాలతో మార్మోగింది. వేల మంది బీసీ సంఘాల కార్యకర్తలు తరలిరావడంతో ధర్నా ప్రాంగణం కిక్కిరిసింది. బీసీల జనాభా, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రతిష్ట వేదికల్లో తగిన శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్‌ను నేతలు పునరుద్ఘాటించారు. ఈ దీక్షలో విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ, న్యాయవాదులు సహా 60కిపైగా బీసీ సంఘాలు పాల్గొన్నారు.
హిందువులను ఓటుబ్యాంకుగా మారుస్తా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్