Home ఆంధ్రప్రదేశ్ హైవే రోడ్డు నుంచి తమ భూములనురక్షించాలి రామచంద్రపురం రైతుల ఆవేదన

హైవే రోడ్డు నుంచి తమ భూములనురక్షించాలి రామచంద్రపురం రైతుల ఆవేదన

by VRM Media
0 comments

ఒంటిమిట్ట తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన రామచంద్రపురంరైతులు

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 18

ఒంటిమిట్ట, నవంబర్ 18: కడప -చెన్నై జాతీయ రహదారి విస్తరణ భాగంగా తమ భూములను హైవే వారు తీసుకుంటున్నారని తమ భూములను రక్షించాలని ఒంటిమిట్ట మండలం మంటపంపల్లెగ్రామపంచాయతీలోని రామచంద్రపురం గ్రామస్తులు మంగళవారం ఒంటిమిట్ట తాసిల్దార్ దామోదర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకుడు బొబ్బిలి రాయుడు ఆధ్వర్యంలో హైవే రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులు తాసిల్దార్ని కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ ఏడవ విడత భూ పంపిణీలు భాగంగా మంటపంపల్లె పంచాయతీ రామచంద్రాపురం సుమారు 40 మంది రైతులకు సర్వే నెంబర్ 24 లో సుమారు 250 ఎకరాలు భూమిని ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు గత 20 సంవత్సరాలుగా ఆ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామన్నారు. కడప- చెన్నై జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తమ భూములను హైవే వారు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. తమ భూములకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నిధులు కూడా మంజూరు చేస్తుందన్నారు. తమ భూములకు సబ్ డివిజన్ చేయకపోవడంతోనే హైవే వారు తమ భూమి తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ భూములకు సబ్ డివిజన్ మంజూరు చేసి పాస్ బుక్ పాస్ పుస్తకాలను అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

2,834 Views

You may also like

Leave a Comment