Home ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ ఆదివాసీ జేఏసీ నాయకులు.

ఏపీ సీఎం రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ప్రకటనపై హర్షం వ్యక్తం చేసిన ఏపీ ఆదివాసీ జేఏసీ నాయకులు.

by VRM Media
0 comments

ఆర్ అండ్ ఆర్ కాలనీ డి రావి లంక గ్రామం నుండి ఎం రావిలంక గ్రామం వరకు బైక్ ర్యాలీ.

ఎన్నికల ముందు ఏపీ సీఎం ఆదివాసీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలి.

దేవీపట్నం ప్రెస్ నోట్: VRM Midea దుర్గా ప్రసాద్

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,ఇందుకూరుపేట గ్రామంలో ఏపీ ఆదివాసి జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్,ఆదివాసి మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం బంగారు బాబు మాట్లాడుతూ…
రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించటం పై హర్షం వ్యక్తం చేస్తూ ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఆర్ అండ్ ఆర్ కాలనీ డి.రావి లంక గ్రామం నుండి ఎం రావి లంక గ్రామం వరకు శాంతియుత వాతావరణం లో నిర్వహించడం జరిగిందన్నారు.అలాగే ఏపీ సీఎం ఎన్నికల ముందు ఆదివాసి నిరుద్యోగులకు 100% ఉద్యోగాలు స్థానిక ఆదివాసిలతోనే భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని విజ్ఞప్తి చేయటం జరిగింది.తక్షణమే (టిఎసి) ట్రైబల్ అడ్వైజర్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తక్షణమే తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసీ పార్టీ మండల అధ్యక్షుడు చవలం విద్యాసాగర్,సారపు కామేష్,జోడే మురళి,తుర్రం సత్యనారాయణ,మడకం శివ,ఈరేటి దుర్గాప్రసాద్,కంగాల కిరణ్,కోటం అజయ్,కుంజం విష్ణు,కంగల రాజేష్,కుంజం పండు దొర,కుంజం చందు,జనసేన మూర్తి,కంగల గిరి,కుంజం శివ,కోటం వెంకన్న దొర,కుంజం వీరపు దొర,కుంజం బాలు దొర,పందిరి శ్రీనివాసు దొర, జనసేన కారం దుర్గాప్రసాద్, జనసేనా మండల కార్యదర్శి కొమరం దొరబాబు మొదలైన వారు పాల్గొన్నారు.

2,827 Views

You may also like

Leave a Comment