
VRM మీడియా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతి నిధి నవంబర్,26. బెల్లంపల్లి లోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించిన మంచిర్యాల డిటిడిఓ కె.రమాదేవి. బుధవారం బెల్లంపల్లి లోని ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాల సందర్శనకు వచ్చిన డిటిడిఓ రమాదేవి ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదులను, వంటగదులను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారంగా బబ్బెర గుడాలను తీసుకున్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ సందర్భంగా విద్యార్థులకు రాజ్యాంగ ఆవశ్యకత గూర్చి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఎ. నరసింహా తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.