Home ఎంటర్‌టెయిన్మెంట్ ‘అఖండ2’తోపాటు చిరంజీవిగారు, ప్రభాస్‌గారి సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలి – VRM MEDIA

‘అఖండ2’తోపాటు చిరంజీవిగారు, ప్రభాస్‌గారి సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలి – VRM MEDIA

by VRM Media
0 comments
'అఖండ2'తోపాటు చిరంజీవిగారు, ప్రభాస్‌గారి సినిమాలు కూడా పెద్ద హిట్ అవ్వాలి



నటసింహ నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అఖండ2’ చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా కూకట్‌పల్లిలోని కైతలాపూర్‌ గ్రౌండ్స్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో జరిగింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చిన నందమూరి అభిమానుల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘బాలయ్యబాబే మా ఆస్తి, ఆయనే మా పవర్‌, ఆయనే మా ధైర్యం. హీరోయిన్‌ సంయుక్త మీనన్‌, ఆది పినిశెట్టి, ఛటర్జీ, మురళీ మోహన్‌, మహేంద్రన్‌, కబీర్‌ సింగ్‌, రచ్చ రవి, హర్షాలీ, పూర్ణ.. ఇలా సినిమాలో నటించిన వారందరికీ థ్యాంక్స్‌. నేను ఎప్పుడూ ఎమోషన్ ని నమ్ముతాను. ఆ ఎమోషన్‌తో వచ్చే యాక్షన్‌ని నమ్ముతాను. ఇందులో రామ్‌ లక్ష్మణ్‌, రాహుల్‌, రవి వర్మ అద్భుతమైన ఫైట్స్‌ కంపోజ్‌ చేశారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ ప్రకాష్‌ సృష్టికి ప్రతి సృష్టి చేశారు. థమన్‌తో జర్నీ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. మన సినిమాకి సెన్సార్ పూర్తయింది. యుఎ సర్టిఫికెట్‌ వచ్చింది. సెన్సార్ సభ్యులు చాలా గౌరవంగా అభినందించారు. మీరు ఈ సినిమాతో ఒక గౌరవమైన స్థానంలో ఉంటారు అని చెప్పడం చాలా సంతోషాన్ని కలిగించింది. సినిమాకి కులం లేదు, మతం లేదు. సినిమా పరిశ్రమ ఏ ఒక్కరిదో కాదు, అందరిదీ. మన సినిమా ముందు వస్తున్న సినిమాలు, మన సినిమా తర్వాత వస్తున్న సినిమాలు కూడా పెద్ద విజయం సాధించాలి. అందరూ సంతోషంగా ఉండాలి. మన సినిమా తర్వాత ప్రభాస్‌ మారుతిల రాజాసాబ్‌ వస్తోంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే సంక్రాంతికి చిరంజీవిగారి సినిమా వస్తోంది. అది కూడా పెద్ద హిట్ అవ్వాలి. మన సినిమా ఒక్కటే కాదు, అందరి సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి. అందరూ బాగుండాలి’ అన్నారు.

2,818 Views

You may also like

Leave a Comment