Home తెలంగాణ మాజీ నక్సలైట్ దారుణ హత్య రాజన్న సిరిసిల్లలో ఘటన… – VRM MEDIA

మాజీ నక్సలైట్ దారుణ హత్య రాజన్న సిరిసిల్లలో ఘటన… – VRM MEDIA

by VRM Media
0 comments
మాజీ నక్సలైట్ దారుణ హత్య రాజన్న సిరిసిల్లలో ఘటన...


సిరిసిల్ల, జగిత్యాల టౌన్, నవంబర్ 28 (ఈవార్తలు): రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టల్లో మాజీ నక్సలైట్‌లో దారుణ హత్యకు పాల్పడ్డాడు. గురువారం తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామానికి చెందిన సిద్దయ్య ఆలియాస్ నర్సయ్య (50)ను జగిత్యాల జిల్లాకు చెందిన సంతోష్ బండరాళ్లతో మోది చంపేశాడు. రాత్రి కుటుంబసభ్యులకు సమాచారం అందివ్వగా హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుంది. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే మహేశ్ బాబాసాహెబ్, పోలిసు అధికారులతో కలిసి ఘటనను పరిశీలించారు. అనంతరం వేములవాడ ప్రభుత్వ దవాఖానలోని మార్చురీలోని సిద్దన్న మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. సిద్దన్నను సంతోష్ ఒక్కడే హత్య చేయలేదని, మరికొంత మంది హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్దన్నకు ఇద్దరు భార్యలు పోశవ్వ, ఎల్లవ్వ ఉన్నారు. మొదటి భార్యకు కొడుకు అశోక్, రెండో భార్యకు కొడుకు నరేష్, కూతురు ఉన్నారు.

తండ్రిని చంపిన పగతోనే..

మూడేళ్ల క్రితం యూట్యూబ్ ఛానల్లో బల్లెపు సిద్దన్న, మరో ఇద్దరు మాజీ మావోయిస్టులతో కలిసి ఇంటర్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్యూలో తాము మావోయిస్టుగా ఉన్న సమయంలో ఫలానా వారిని చంపామని చెప్పాడు. అందులో సంతోష్ తండ్రి కూడా ఉన్నట్లు తెలిసింది. యూట్యూబ్‌లో సిద్ధన్న ఇంటర్యూ చూసిన సంతోష్.. తన తండ్రిని చంపినందుకు పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎలాగైనా సిద్ధన్నను మట్టుబెట్టాలని నిర్ణయించుకొని, తన ప్రణాళికలో భాగంగా 3 నెలలుగా సిద్ధన్నతో స్నేహం పెంచుకున్నాడు. యూట్యూబ్‌ ఇంటర్వ్యూ గురువారం మధ్యాహ్నం సిద్దన్నను అగ్రహారం గుట్టల వద్దకు రప్పించాడు. అక్కడ ఆయనకు మద్యం తాగించి బండరాయితో మోది, గొంతుకోసి చంపేశాడు. నిందితుడు జగిత్యాలలో పోలీసులకు లొంగిపోయాడు.

ఆర్థిక వృద్ధి.. 8.2% రెండో త్రైమాసికంలో పైపైకి అంచనాలకు మించి రయ్.. రయ్ దూసుకెళ్లిన భారత ఆర్థిక వ్యవస్థ….
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,815 Views

You may also like

Leave a Comment