Home తెలంగాణ జగిత్యాలలో మండలాలవారిగా షెడ్యూల్ విడుదల – VRM MEDIA

జగిత్యాలలో మండలాలవారిగా షెడ్యూల్ విడుదల – VRM MEDIA

by VRM Media
0 comments
జగిత్యాలలో మండలాలవారిగా షెడ్యూల్ విడుదల


జగిత్యాల టౌన్, నవంబర్ 25 (ఈవార్తలు): స్థానిక ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేసిన నోడల్ ఆఫీసర్ లు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిందని, షెడ్యూల్ ప్రకారం జిల్లాలో విడతలుగా ఎన్నికలు జరుగుతాయని అందుకు సంబంధించిన మూడు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలో మొదటి విడత స్థానిక ఎన్నికలు 7 మండలాల్లో.. మేడిపెల్లి, భీమారం, కథలాపూర్, కోరుట్ల, మెట్ పెల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నంలో, రెండవ విడత స్థానిక ఎన్నికలు 7 మండలాల్లో.. రాయికల్, బీర్‌పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, సారంగాపూర్, మల్యాల, కొడిమ్యాల, ధర్మారం మండలాల్లో, మూడో విడత ఎన్నికలు. వెల్గటూర్, ఎండపెగడపెల్లిలో, జరుగనున్న వసతి. ఎన్నికల సామగ్రి, బ్యాలెట్ పత్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు ఫ్లెక్సీలు, స్టేషనరీకి సంబంధించినవి బుధవారం మరోసారి సరి చూసుకోవాలని, పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు.

Daily Horoscope | ఈ రోజు రాశి ఫలాలు 29 నవంబర్ 2025
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,813 Views

You may also like

Leave a Comment