

ప్రత్తిపాడు VRM MEDIA న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్ 30:–
ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ప్రథమ చికిత్స పై శనివారం శిక్షణ శిభిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్ధులకు 6 రోజుల సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ శిభిరాన్ని కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపల్ కె వేంకటేశ్వర రావు శనివారం ముగించారు.డా.యన్,సి.పరాసర, స్టేట్ లెవెల్ మెడికల్ ఆఫీసర్ కాకినాడ శిక్షకులుగా వ్యవహరించారు. శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రధమ చికిత్సలయిన కట్లు కట్టడము, రక్తము పోకుండా ఆపడము, ఊపిరి ఆడడము కష్టముగా ఉన్నప్పుడు కుత్రిమ శ్వాస ఇవ్వడము, ప్రాణాన్ని నిలపడము,ఉన్న గాయాన్ని ఎక్కువవకుండా చూడడము.బాధ నుండి బయటపడడానికి సహాయము చేయడము, రోడ్డు ప్రమాదములో గాయపడ్డ సమయమందు ఎటువంటి సహాయం అందించాలి అనే అంశాలు శిక్షణ కాలంలో నేర్పించారు.ఈ శిక్షణ కార్యక్రమానికి, డా.ప్రయాగ మూర్తి ప్రగడ,కె.సురేశ్,డా.మదీనా కన్వెనెర్స్ గా వ్యవహరించారు. 60 మంది విద్యార్ధులకు రెడ్ క్రాస్ సొసైటి నుంచి సర్టిఫికెట్స్ అందించారు.
ఈ కార్యక్రమంలో అద్యాపకులు వి . రామా రావు డా. శివ ప్రసాద్, శ్రీలక్ష్మి, వీరభద్ర రావు, డా. బంగార్రాజు, సతీశ్, మేరీ రోజలీనా, పుష్పా, రాజేష్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి నుంచి చైతన్య అధ్యాపకేత సిబ్బంది,సత్యనారాయణ,ధర్మ రాజు,దివ్య,రామలక్ష్మి కమల, కళావతి, విద్యార్దిని విద్యార్దులు పాల్గొన్నారు.