Home ఆంధ్రప్రదేశ్ దిత్య తుఫాన్ పొంచి ఉండడంతో ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి

దిత్య తుఫాన్ పొంచి ఉండడంతో ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండండి

by VRM Media
0 comments

ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్
నరసింహారాజు

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 30

ఒంటిమిట్ట సిద్దవటం మండల పరిధిలో వాతావరణ మార్పులు బలమైన గాలులు భారీ వర్షాల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటిమిట్ట సిద్ధవటం మండలాల సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ రాజు ప్రజలకు తెలిపారు. ప్రజలు భయపడవద్దు జాగ్రత్త పడండి లోతట్టు ప్రాంతాలు బలహీన ఇల్లులు వర్షపు నీరు నిలిచే చోట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా కొన్ని కొన్ని గృహాలు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆయన తెలిపారు. తుఫాను కారణంగా మాత్రమే కాకుండా తీవ్ర చలిగాలులు వల్ల సైతం ప్రజల ఆరోగ్యానికి భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఉదయం రాత్రి వేళల్లో అనవసరంగా బయటికి రావద్దు అన్నారు వృద్ధులు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా గోరువెచ్చని నీరు త్రాగాలని జలుబు దగ్గు జ్వరము ఉంటే వెంటనే ఆసుపత్రులకు సంప్రదించాలని చెట్ల క్రింద విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడరాదు అన్నారు. పెన్నా నది తీర ప్రాంతాల ప్రజలు చేపల వేటకు వెళ్ళొద్దని నదిలో దిగువద్దని అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.

2,834 Views

You may also like

Leave a Comment