Home వార్తలు 60 రోజుల ముందే టికెట్ బుకింగ్ – VRM MEDIA

60 రోజుల ముందే టికెట్ బుకింగ్ – VRM MEDIA

by VRM Media
0 comments
60 రోజుల ముందే టికెట్ బుకింగ్


ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

హైదరాబాద్, నవంబర్ 30 (ఈవార్తలు): ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సు ప్రయాణానికి 60 రోజుల ముందుగానే టికెట్లను రిజర్వేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా పండుగలు, సెలవుల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే తమ ప్రయాణ ప్రణాళికలు వేసుకునేందుకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ 60 రోజుల ముందస్తు బుకింగ్ సదుపాయం గతంలోనూ అందుబాటులో ఉంది. అయితే కార్యక్రమం చాలా మందికి అవగాహన లేకపోవడంతో, పండుగల సీజన్ నేపథ్యంలో దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవలి కాలంలో టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘గమ్యం’ యాప్‌ ద్వారా బస్సుల లైవ్ లొకేషన్ తెలుసుకునే సదుపాయం కల్పించింది. ఇంకా, పలు ప్రధాన రూట్లలో ఏసీ, సీటర్, స్లీపర్ వంటి కొత్త సర్వీసులను కూడా అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణంలోనే బస్సు బయలుదేరే సమయం, స్టాపుల వివరాలను ముందుగానే అందిస్తూ ప్రయాణాన్ని సులభతరం చేస్తోంది.

ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి… మహారాష్ట్ర నాందేడ్‌లో యువకుడి హత్య…
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

2,816 Views

You may also like

Leave a Comment