Home వార్తలుఖమ్మం మర్లపాడు  గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాకలు..

మర్లపాడు  గ్రామపంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాకలు..

by VRM Media
0 comments

Vrm Media ప్రతినిధి రాంబాబు

సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు మండలం మర్లపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది. గ్రామంలోని అభ్యర్థి చిమిరాల సురేష్ గారు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అనుచరులు, గ్రామస్థులు పాల్గొని ర్యాలీ నిర్వహించారు. డప్పులు, నినాదాలతో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది.

అదే విధంగా గ్రామ పంచాయతీకి చెందిన 10 మంది వార్డ్ మెంబర్ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు  చేశారు.

మర్లపాడు గ్రామంలో ప్రజాస్వామ్య పండుగగా సాగిన ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు తమ మద్దతు తెలిపారు.

2,839 Views

You may also like

Leave a Comment