
చింతరాజుపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డే. వెంకటరమణ
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 4
ఒంటిమిట్ట: రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా కడప జిల్లాలో ఉన్న ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడంతో రెండు మండలాల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారిందని రెండుమండలాల్లోని మారిందనిరెండుప్రజలు వారిని కడప జిల్లాలోనే సోమవారం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యలయంలోనే ఒంటిమిట్ట మండల కార్యలయంలోనే కడపజిల్లాలోనే కొనసాగించాలని .ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడం ఆ రెండు మండలాల్లోని 95 శాతం ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. దీంతో మండలాల విభజాన పై ప్రజా తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు.
కడప జిల్లాకు ఆధ్యాత్మిక కేంద్రాన్ని దూరం చేస్తున్నారు
కడప జిల్లాకు చెప్పుకోదగ్గ ఆధ్యాత్మిక కేంద్రం మన ఒంటిమిట్ట కోదండ రామస్వామి దేవాలయం. అలాంటి రాష్ట్రం గుర్తింపు పొందిన ఏకైక ఆధ్యాత్మిక కేంద్రం ఉన్న ఒంటిమిట్ట మండలాన్ని కడప జిల్లా నుంచి అన్నమయ్య జిల్లాలో కలిపితే కడప జిల్లా ప్రజలకు ఆధ్యాత్మిక కేంద్రాన్ని దూరం చేసినట్లే నని అలాగే రాజులకాలం నాటి చారిత్రక కట్టడమైన నాటిసిద్ధవటం కోట ఎంతో ప్రాచీనం పొందింది అలాంటి కోట ఉన్న సిద్ధవటం మండలాన్ని అన్నమయ్య జిల్లాలో కలిపితే కడప జిల్లాకు ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోతుందన్నారు.
కడప జిల్లా కేంద్రం ఒంటిమిట్ట, సిద్ధవటం ప్రజలకు అత్యంత సమీపం.
ఒంటిమిట్ట, సిద్ధవటం మండల ప్రజలకు కడప జిల్లా కేంద్రం భౌగోళికంగా అత్యంత సమీపంగా ఉంటుందని చింతరాజుపల్లిచింతరాజుపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డే వెంకటరమణ.అన్నారు. అలాంటి కడప జిల్లాను వదిలి వందల కి.మీ దూరం ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రానికి ఈ రెండు మండలాలను బదిలీ చేయడం ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రజలు ప్రభుత్వ పనుల కోసం, వృద్ధులు, వికలాంగులు ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం తరచూ అత్యంత సమీపంలో ఉన్న కడప జిల్లా కేంద్రానికి వెళ్లి వస్తూ ఉంటారు. అలాంటి సౌకర్యవంతమైన సౌలభ్యాన్ని ఒంటిమిట్ట, సిద్ధవటం మండల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో దూరమవుతుందన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird