Home ఎంటర్‌టెయిన్మెంట్ రామ్ గోపాల్ వర్మ హీరోగా షో మ్యాన్.. ఫస్ట్ లుక్ అదిరింది! – VRM MEDIA

రామ్ గోపాల్ వర్మ హీరోగా షో మ్యాన్.. ఫస్ట్ లుక్ అదిరింది! – VRM MEDIA

by VRM Media
0 comments
రామ్ గోపాల్ వర్మ హీరోగా షో మ్యాన్.. ఫస్ట్ లుక్ అదిరింది!



సంచలన దర్శకుడు గోపాల్ వర్మ(రామ్ గోపాల్ వర్మ) హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రం “షో మ్యాన్”. “మ్యాడ్ మాన్స్టర్” అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నటుడు సుమన్ ఇందులో విలన్ గా నటిస్తుండడం విశేషం. సుమన్ విలన్ గా నటించిన రజినీకాంత్ చిత్రం “శివాజీ” ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుస్తుంది. “నూతన్” అనే నూతన దర్శకుడు ఈ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నాడు. ఆర్జీవీతో ఇంతకుముందు “ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2” చిత్రాలు నిర్మించి, ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగిన ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ.. ఓ ప్రముఖ ప్రొడక్షన్ సంస్థతో కలిసి భీమవరం టాకీస్ పతాకంపై 120గా ఈ చిత్రాన్ని నిర్మించారు.

రామ్ గోపాల్ వర్మకు అత్యంత ప్రీతిపాత్రమైన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తుమ్మసత్యనారాయణ తెలిపారు.

రామ్ గోపాల్ వర్మ హీరోగా, సుమన్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఎలా ఉంటుందోనన్న ఆసక్తి చూపుతోంది. వర్మ లుక్ ఎలా ఉంటుందో తెలిపేలా కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్స్ లో గ్యాంగ్ స్టర్ గా ఆయన లుక్ ఆకట్టుకుంటోంది.

2,829 Views

You may also like

Leave a Comment