Home ఎంటర్‌టెయిన్మెంట్ తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వచ్చిందా.. అఖండ2 రిలీజ్ కష్టమే.. ఎందుకంటే? – VRM MEDIA

తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వచ్చిందా.. అఖండ2 రిలీజ్ కష్టమే.. ఎందుకంటే? – VRM MEDIA

by VRM Media
0 comments
తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వచ్చిందా.. అఖండ2 రిలీజ్ కష్టమే.. ఎందుకంటే?



– ఓవ‌ర్సీస్ చేజారిపోయిందా?
– బాలయ్యకు ఇదే తొలి అనుభవం
– తీర్పు అనుకూలంగా వచ్చినా స‌మ‌స్య‌లెన్నో

అఖండ2 రిలీజ్‌పై ఏర్పడ్డ వివాదంపై మద్రాస్‌ హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. ఈరోస్‌ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను 14 రీల్స్‌ చెల్లించిందని, ఈరోజుతో ఈ సమస్య పరిష్కారమవుతుందని. వాదోపవాదాలు విన్న కోర్టు ఇచ్చిన తీర్పు 14 రీల్స్‌కి అనుకూలంగా వచ్చినప్పటికీ సినిమా రిలీజ్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

14 రీల్స్, ఈరోస్ ఇంటర్నేషనల్ మధ్య ఉన్న ఆర్థిక వివాదాలను పరిష్కరిస్తే ఈరోజు సాయంత్రం ప్రీమియర్స్ పడిపోతాయి. అయితే అవి ఇండియాకి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఓవర్సీస్‌లో ‘అఖండ2’కి కేటాయించిన థియేటర్లు ఇప్పుడు అందుబాటులో లేవని కనిపిస్తాయి.

అంతకుముందు బిగ్ రేంజ్‌లో థియేటర్లను ‘అఖండ2’కి కేటాయించారు. ఒకరోజు సినిమా పోస్ట్‌పోన్‌ అవ్వడం వల్ల కొన్ని సింగిల్‌ స్క్రీన్‌లు మాత్రమే లభించే అవకాశం ఉంది. ‘అఖండ2’కి కేటాయించిన థియేటర్లను ‘జూటోపియా2’తోపాటు మరో సినిమాకి కేటాయించి టికెట్లు సెల్‌లు చేస్తున్నారు. ఇప్పుడా థియేటర్స్‌లో ‘అఖండ2’ చిత్రం షోలు తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. ఇలాంటి పరిస్థితుల్లో వున్న ఓవర్సీ డిస్ట్రిబ్యూటర్లు ఒక వారం తర్వాత ‘అఖండ2’ విడుదల చేయవలసి ఉంటుంది.

ఒకరోజు పోస్ట్ పోన్ అయినప్పటికీ ఇప్పుడు రిలీజ్ చేసుకోగలిగితే ఓకే.. లేదంటే మళ్ళీ డిసెంబర్ 12కి ప్రయత్నం చేయాలి. అది కూడా మిస్ అయితే డిసెంబర్ 19కి వెళ్లాలి. అదే టైమ్‌కి ‘అవతార్‌3’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ఇండియాలో పరిస్థితి ఎలా ఉన్నా.. ఈరోజు అంటే డిసెంబర్‌ 5 శుక్రవారం ఓవర్సీస్‌లో ‘అఖండ2’ రిలీజ్‌ లేనట్టే అనుకోవాలి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బాలయ్యబాబు సినిమా ఈరోజు అక్కడ రిలీజ్ అవ్వదు.

2,811 Views

You may also like

Leave a Comment