

ప్రెస్ నోట్:VRM Media దుర్గా ప్రసాద్
అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలంల ఇందుకూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మరియూ కాలేజీ నందు మెగా పేరెన్స్ ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతూ…నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో అమలు చేస్తున్న గుణాత్మక విద్యను విద్యార్థులందరూ తార్కిక జ్ఞానంతో అందిపుచ్చుకోవాలన్నారు.ఈ ప్రపంచాన్ని మార్చగలిగే ఒకే ఒక్క ఆయుధం చదువు అన్నారు.చదువు ఒక్కటే సామాన్యులను కూడా ఉన్నత స్థానంలో నిలబెడుతుందన్నారు.కావున ప్రతి తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని మీ పిల్లలను ప్రతిరోజు పాఠశాలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను మరియు ప్రోగ్రెస్ రిపోర్టులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు.ఈరోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు సందర్భంగా ఇందుకూరుపేట పాఠశాల, కళాశాల మరియు దామనపల్లి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల మరియు కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశాలలో పాల్గొనడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు, సొసైటీ అధ్యక్షులు, విద్యాకామిటి చైర్మన్ లు,మాజీ మండల అధ్యక్షులు, ఎంపీటీసీ లు,జడ్పీటీసీ లు,సర్పంచ్ లు, బిజెపి మండల అధ్యక్షుడు కారం రామన్న దొర ,పాల్గొనగా జనసేనపార్టీ మండలం అధ్యక్షులు చారపు వెంకటరాయుడు,సీనియర్ నాయకులు కోండ్ల సురేష్ రెడ్డి, ఐనవిల్లి భద్రం,మీడియా కోఆర్డినేటర్ కారం దుర్గాప్రసాద్ మొదలైన నాయకులు పాల్గొన్నారు.