Home ఆంధ్రప్రదేశ్ వాడపల్లి వెంకన్న సేవలో.. శ్రీనివాస్‌ యాదవ్‌- ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియామకం

వాడపల్లి వెంకన్న సేవలో.. శ్రీనివాస్‌ యాదవ్‌- ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడిగా నియామకం

by VRM Media
0 comments

  • రంపచోడవరం పరిశీలకులకు దక్కిన అరుదైన గౌరవం

– సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఉత్తర్వులు జారీ

రంపచోడవరం ​ప్రెస్ నోట్: VRM Media దుర్గా ప్రసాద్

డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి (ట్రస్ట్‌ బోర్డు) సభ్యుడిగా కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ నియమితులయ్యారు. కాకినాడ జిల్లా బీసీ టీడీపీ ప్రధాన కార్యదర్శిగా, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గ పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాస్‌ యాదవ్‌కు.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ బాధ్యతలు అప్పగించారు.
​సేవా తత్పరతే గుర్తింపు:
పార్టీలో ఎన్నో కీలక పదవులు చేపట్టిన శ్రీనివాస్‌ యాదవ్‌.. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారని పేరుంది. హిందూ ధర్మం పట్ల ఆయనకున్న అంకితభావం, ఆలయాల అభివృద్ధిపై ఆయనకున్న శ్రద్ధను గుర్తించి ప్రభుత్వం ఈ పదవిని కట్టబెట్టింది.
​అభివృద్ధే లక్ష్యం:
ఈ సందర్భంగా శ్రీనివాస్‌ యాదవ్ మాట్లాడుతూ.. “కలియుగ ప్రత్యక్ష దైవం వాడపల్లి వెంకన్న ఆలయ సేవలో భాగస్వామినవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించడంలోనూ, ఆలయ అభివృద్ధి, సంప్రదాయాల పరిరక్షణలోనూ నా వంతు కృషి చేస్తాను” అని తెలిపారు.
​వెల్లువలా అభినందనలు:
నూతన బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్‌ యాదవ్‌ను పలువురు టీడీపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు కలిసి పూలమాలలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకం పట్ల స్థానిక భక్తులు హర్షం వ్యక్తం చేశారు.

2,816 Views

You may also like

Leave a Comment