Home ఎంటర్‌టెయిన్మెంట్ మా పరిస్థితి అర్థం చేసుకోండి.. ఫ్యాన్స్‌కి డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన – VRM MEDIA

మా పరిస్థితి అర్థం చేసుకోండి.. ఫ్యాన్స్‌కి డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన – VRM MEDIA

by VRM Media
0 comments
మా పరిస్థితి అర్థం చేసుకోండి.. ఫ్యాన్స్‌కి డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన




-అఖండ 2 కోసం ఎదురుచూపులు
-డిస్ట్రిబ్యూటర్ల ట్వీట్
-అక్కడ ఏం జరుగుతుంది!

గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ ‘బాలకృష్ణ'(బాలకృష్ణ)మూవీ రిలీజ్ రోజు అభిమానులు చేసే హంగామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అలాంటిది శివ స్తుతుడిగా ‘అఖండ 2’తో బాలయ్య తాండవం చేస్తుంటే వాళ్ళ హంగామా మరో రేంజ్ లో ఉంటుంది. ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేసినా హంగామా విషయంలో తగ్గేదెలే అనే విధంగా ఉంటారు. దీనికి ఓవర్ సీస్ అభిమానులు కూడా మినహాయింపు కాదు . రీసెంట్ గా ఓవర్ సీస్ అభిమానులని రిక్వెస్ట్ చేస్తు అఖండ 2(అఖండ 2)ని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మోక్ష మూవీస్(మోక్ష మూవీస్)ఒక ట్వీట్ చేసింది.

పోస్ట్ చేసిన ట్వీట్ లో ‘అఖండ 2’ మా సంస్థకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. అభిమానులకి,ప్రేక్షకులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలంటే చాలా ప్లాన్‌లు చేశాం. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మన చేతుల్లో ఉండవు. ఈ చివరి సమయంలో థియేటర్లు అడ్జస్ట్ చేయడం పెద్ద ఛాలెంజ్. అయినప్పటికీ మేము కొంతవరకు విజయం సాధించాము. మీ షెడ్యూల్‌కి అనుగుణంగా షోస్ ప్లాన్ కోసం మీ మద్దతు కావాలి. థియేటర్లు షోటైమ్స్ ఫైనల్ చేస్తున్నాం. ఈ రాత్రికి లేదా రేపు పూర్తి జాబితాను అందిస్తాం. 11న USAలో గ్రాండ్ ప్రీమియర్స్ ఉంటారని తాజాగా ట్వీట్ లో ఉన్నారు.

ఇది కూడా చదవండి: అఖండ 2 ఎఫెక్ట్.. రిలీజ్ వాయిదా పడిన కొత్త చిత్రాలు

అభిమానులు కూడా మోక్ష మూవీస్ పై సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు ‘ఎంత ఇబ్బంది వచ్చినా అఖండ 2 ని గ్రాండ్‌గా చూపిస్తారనే నమ్మకం ఉంది. లేటైనా సరే బెస్ట్ థియేటర్లలో మూవీ చూస్తామంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అభిమానులైతే ఏకంగా కొన్ని థియేటర్లని ట్యాగ్ చేస్తూ, అదనపు స్క్రీన్‌లు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ సీస్ లో అఖండ 2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.

2,812 Views

You may also like

Leave a Comment