Home ఆంధ్రప్రదేశ్ కోటపాడు చెరువులో 11.40 లక్షల చేప పిల్లల విడిచివేత

కోటపాడు చెరువులో 11.40 లక్షల చేప పిల్లల విడిచివేత

by VRM Media
0 comments

చెరువులో జీవవైవిద్యం పునరుద్ధరణ స్థానిక ఉపాధి కార్యక్రమం.

రాజంపేట టిడిపి ఇన్‌చార్జ్ జగన్మోహన్ రాజు చొరవతో కార్యక్రమం నిర్వహణ

కడప జిల్లా మత్స్య సంఘం డైరెక్టర్ రమణ ఆధ్వర్యంలో

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 12

ఒంటిమిట్ట డిసెంబర్ 12: కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కోటపాడు సమీపంలో సోమశిల వెనుక జలాలలో శుక్ర వారం రాష్ట్ర మత్స్యపాలన అభివృద్ధి కార్యక్రమం భాగంగా 12 లక్షల చేప పిల్లలను ఘనంగా విడిచివేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపల ఉత్పత్తి పెంపు, గ్రామీణ మత్స్యకారుల ఆదాయ వృద్ధి లక్ష్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, అలాగే రాజంపేట తెలుగు దేశం పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ జగన్మోహన్ రాజు చొరవతో నిర్వహించడం జరిగింది.
అధికారుల సమక్షంలో చేపట్టిన చేప పిల్లల విడుదల
చేప పిల్లల విడిచివేత కార్యక్రమానికి కడప డిడి నాగయ్య, అన్నమయ్య డీఎఫ్ఓ సుస్మిత, FDOలు ఏ. కిరణ్‌కుమార్, ఆర్. బాలరాజు, వి ఎఫ్ ఏ లు నూరి మస్తానమ్మ, ప్రసన్న క్రాంతి, సి. బాలకుమారరెడ్డి పాల్గొన్నారు. ఫీల్డ్ సిబ్బందిగా నిత్యపూజ, రమణ, కులయప్ప తదితరులు హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం ప్రభుత్వ మత్స్యపాలన శాఖ పర్యవేక్షణలో సజావుగా కొనసాగింది. మొత్తం 11.40 లక్షలు (80-100 mm సైజ్) చేప పిల్లలు ఉచితంగా వదలడం జరిగింది. ఇందులో కట్ల 0.30 లక్షలు, రోహు 3.90 లక్షలు మరియు మృగాల 7.20 లక్షలు ఇవి ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫార్మ్, కడప క్షేత్రం లో పెంచడంజరిగిందన్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా బెస్టా కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఎం. వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. మత్స్యకార కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. చేప పిల్లల విడిచివేతతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, చెరువుల ఉత్పత్తి శక్తి మరింత బలపడుతుందని తెలిపారు.
ఎంపీడీవో సుజాతమ్మ, సిఐ నరసింహరాజు, ఫారెస్ట్ అధికారుల సమన్వయం
కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు ఎంపీడీవో సుజాతమ్మ, సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు, ఫారెస్ట్ శాఖ అధికారులు కీలక పాత్ర పోషించారు. భద్రతా ఏర్పాట్లు, ప్రజా నిర్వహణ సజావుగా ఉండేలా సమన్వయం జరిపారు. స్థానిక ప్రజలు, మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామీణ మత్స్యకారులకు కొత్త ఆశలు – ఆర్థిక వ్యవస్థకు ఊతం
చేప పిల్లల విడిచివేతతో గ్రామీణ మత్స్యకారుల ఆదాయం పెరగడం, చేపల ఉత్పత్తిలో పెరుగుదల, చెరువులో జీవవైవిధ్యం పునరుద్ధరణ, స్థానిక ఉపాధి అవకాశాలు పెరగడం వంటి ప్రయోజనాలు కలుగనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దు కృష్ణారెడ్డి. టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి. క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎస్వీ రమణ. టిడిపి మాజీ మండల ప్రధాన కార్యదర్శి బొబ్బిలి రాయుడు. చింతరాజుపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొడ్డే వెంకటరమణ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సాలాబాద్ బుజ్జి. బిజెపి మండల అధ్యక్షుడు భాను ప్రకాష్ రాజు. బిజెపి మండల ప్రధాన కార్యదర్శి జగదీష్ కుమార్. బిజెపి ఉపాధ్యక్షుడు వెంకటరత్నం. నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

2,816 Views

You may also like

Leave a Comment