

ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కడపలోని కొనసాగించాలి.
YCP. మండల అధ్యక్షుడు.టక్కో లి. శివారెడ్డి. ఆధ్వర్యంలో
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 13
ఒంటిమిట్ట మండలంలో జేఏసీ ఆధ్వర్యంలో ఎనిమిదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు. శనివారం నాడు వైసిపి మండల అధ్యక్షుడు T. శివారెడ్డి ఆధ్వర్యంలో. మాజీ గిడ్డంగుల శాఖ డైరెక్టర్. A. వేణుగోపాల్ రెడ్డి. మాజీ సర్పంచ్ సుంకేసుల సుబ్బరాయుడు. బత్తల సుబ్బ నరసయ్య. వైసీపీ సీనియర్ నాయకుడు లంక రామ్ రెడ్డి వైఎస్ఆర్సిపి. వెంకట శేషారెడ్డి. ఉమ్మడి కృష్ణారెడ్డి. ఆరవ శ్రీనివాసరెడ్డి. సర్పంచ్ ప్రతినిధి కడప మహబూబ్ బాషా. నిరాహార దీక్షలో పాల్గొన్నారు. భారతదేశంలోని రెండో అయోధ్యగా పేరుగాంచిన ఏకశిలా నగరం ఒంటిమిట్ట మరియు రాయలేలిన సిద్ధూటం కోట ఎంతో ప్రసిద్ధిగాంచిన పురాతన కట్టడాలు ఉన్న. పురాతన చరిత్రలు కలిగిన ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను రాయచోటిలో కాకుండా కడప జిల్లాలో కొనసాగించాలన్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ప్రజల్లో ఈ వసంతృప్తి నెలకొనడంతో ఉద్యమం రోజురోజుకు రిలే నిరాహార దీక్ష ఉద్యమం ఉదృత రూపం దాల్చుతుంది రాయచోటి వద్దు కడప ముద్దు అనే నిన్న అనే నినాదంతో మారుమోగి పోయింది రాయచోటికి వెళ్లాలంటే రైతులకు వృద్ధులకు వికలాంగులకు మహిళలకు ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా పని పెడితే ఒంటిమిట్ట నుండి రాయచోటికి వెళ్లడం కచ్చితంగా మారుతుంది ఎంత చరిత్ర కలిగిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని రాయలేలి నా సిద్ధుటం కోటను ప్రజల అభిప్రాయాన్ని నాయకుల సూచనలు కాదనకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరం అన్నారు. ఒంటిమిట్ట రాయచోటికి మార్చడం మండల ప్రజల ఆత్మగౌరవని అవమానించడమే అని మా ప్రాంతానికి అన్నీ సదుపాయాలు ఉన్నా ఏ సదుపాయం లేని రాయచోటికి మార్చడం తగదన్నారు. అంతేకాకుండా ఒంటిమిట్ట సిద్దోటం నుండి రాయచోటికి వెళ్లాలంటే 110 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది ఈ రెండు మండలాల నుండి రాయచోటికి వెళ్లాలంటే టైం ప్రకారం బస్సు సౌకర్యాలు కూడా ఉండవు కాబట్టి ప్రభుత్వం ఈ రెండు మండలాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని కడప జిల్లాలోనే ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట చెరువు సంఘం చైర్మన్ గంగిరెడ్డి. లాయర్ రాందాస్. బిజెపి మాజీ మండల అధ్యక్షుడు శివరాజు బాలరాజు. పాల్గొన్నారు.