Home ఆంధ్రప్రదేశ్ యువత మేలుకో ని రాష్ట్ర మెడికల్ కాలేజీలను కాపాడుకో

యువత మేలుకో ని రాష్ట్ర మెడికల్ కాలేజీలను కాపాడుకో

by VRM Media
0 comments

భావితరాలకు బాటలు వేసేందుకు ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుదాం

నరసాపురం పార్లమెంటు పరిశీలకులు
ముదునూరి మురళీకృష్ణ రాజు

పత్తిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్ 13:–

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం. పెద్దమీరం లో ఈనెల 15వ తారీఖు న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి రాష్ట్ర యువత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రావాలని కోటి సంతకాల సేకరణ ను వైఎస్ఆర్సిపి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తు కొరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను యువతను మోసం చేస్తూ వారి భవిష్యత్తును తుంగలోకి తొక్కి వారి స్వంత ప్రయోజనాల కొరకు వారి లబ్ధిదారులకు ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ ఆస్తులను అందులో పని చేసే ఉద్యోగుల జీతాల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించే విధంగా పాలన సాగిస్తున్నారని. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించి పెద్దమీరం లొ జరుగు కార్యక్రమానికి తొలి అడుగై కదలి రావాలని వైఎస్ఆర్సిపి నాయకులు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు & ఎం. ఎం. ఆర్. చారిటబుల్ ట్రస్ట్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణ రాజు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పి.వి.ఎల్ నరసింహారాజు, భీమవరం నియోజకవర్గం ఇంచార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు, స్టేట్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు.

2,812 Views

You may also like

Leave a Comment