

సిద్దవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ,డిసెంబర్ 14
రాయచోటి కేంద్రంగా సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో రెండు మండలాలల్లో ఒక్కసారిగా నిరసన జ్వాలలు చెలరేగాయి మాధవరం-1 గ్రామంలో ఆదివారం 4వరోజు దీక్షకు సంఘీభావంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. వీరిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి హరిప్రసాద్, రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్గనైజేషన్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య, రాజంపేట పార్లమెంటు ఉపాధ్యక్షుడు పుత్తా రామ చంద్రయ్య, రాష్ట్ర దూదేకుల సంఘం డైరెక్టర్ నాగూరు వీరభద్రుడు, సిద్దవటం మండల టిడిపి మాజీ అధ్యక్షుడు మెాహన్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు ధశరధ రామా నాయుడు, రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకటనరసయ్య, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, టిడిపి మహిళా నాయకురాలు కోటపాటి సుబ్బమ్మ, రామ్మోహన్ నాయుడు, నగేష్ నాయుడు తదితరులు మాట్లాడుతూ మా రెండు మండలాలను రాయచోటిలో కలపడం తల్లి బిడ్డలను విడదీయడమేనని కడప నగరానికి మా ప్రజలకు విడదీయరాని బంధం వుందని మా మండలం నుండి కడప పట్టణ ప్రజల దాహార్తిని తీరుస్తున్న విషయాన్ని పెద్దలు గుర్తుంచుకోవాలని త్వరలోనే ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరియు నారా లోకేష్ గార్లను కలసి రెండు మండలాల ప్రజల ఆవేదనను తెలియ చేస్తామని అయితే రాజంపేట లేదంటే కడప ఇదే నినాదంతో ప్రాణత్యాగానికైనా వెనకాడమని ముక్త కంఠంతో నినదించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, కళాకారులు, గ్రామ ప్రజలు, జెఏసి సభ్యులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird