

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 14
ఎస్సై ని ఘనంగా సత్కరించిన టీడీపీ నాయకులు
ప్రజల సహకారంతో నేరరహిత మండలంగా తీర్చిదిద్దుతామని ఎస్‌ఐ హామీ
శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచన
ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్‌గా శ్రీనివాసులు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
ప్రజల సహకారంతో నేరరహిత ఒంటిమిట్టకు కృషి
ఎస్‌ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ, తనపై పెట్టిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, చట్ట వ్యవస్థలను కట్టుదిట్టంగా అమలు చేస్తానన్నారు. నేరాలకు తావు లేకుండా ప్రజల సహకారంతో నేరరహిత ఒంటిమిట్టగా మండలాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.
ఈ సత్కార కార్యక్రమంలో ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, బొబ్బిలి రాయుడు, బొడ్డే వెంకటరమణ నాయుడు,సాలాబాద్ బుజ్జి, ఎంపీటీసీ భాష , బాలకృష్ణ, చంద్రమౌళి, శివ, ప్రతాప్ రెడ్డి, పాటయ్య, శంకర్ దాదా ,ఆదినారాయణ లతో పాటు పలువురు టీడీపీ మండల, గ్రామ స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట వంటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ పోలీస్ శాఖకు ప్రధాన బాధ్యతగా ఉందని నాయకులు పేర్కొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో కట్టుదిట్టమైన చర్యలు అవసరం
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, శ్రీ కోదండ రామస్వామి ఆలయానికి నిత్యం వేలాదిగా వచ్చే భక్తులు, పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే పోలీస్ వ్యవస్థ ద్వారానే శాంతియుత వాతావరణం నెలకొంటుందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా విధులు నిర్వహించే పోలీస్ అధికారి ఎల్లప్పుడూ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తారని తెలిపారు. చిన్న సమస్యలకే పెద్ద వివాదాలు తలెత్తకుండా చట్టబద్ధంగా పరిష్కార మార్గం చూపాలని సూచించారు.