

వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత – జగన్మోహన్ రాజు
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 15
ఒంటిమిట్ట చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి అలుగు పొంగిపొర్లడంతో గ్రామదేవత గంగమ్మకు చెరువు అలుగు వద్ద భక్తిశ్రద్ధలతో జల హారతి కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో చెరువు నిండడం రైతుల్లో, గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది. చెరువు పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి చామర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ, రైతే రాష్ట్రానికి వెన్నెముక అని,వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. చెరువులు, కాలువలు, వాగులు పునరుద్ధరణ ద్వారా సాగునీటి వనరులను బలోపేతం చేస్తూ రైతులకు శాశ్వత భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఒంటిమిట్ట చెరువు నిండటంతో ఈ ప్రాంతంలోని విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందుబాటులోకి వచ్చి పంటలకు మేలు జరుగుతుందన్నారు
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ దామోదర్ రెడ్డి, ఒంటిమిట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహ రాజు. సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు. జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి పాల్గొని రైతులతో మాట్లాడారు. వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు.
చెరువు చైర్మన్ గంగిరెడ్డి, వైస్ చైర్మన్ యానాదయ్య, ఇరిగేషన్ డీఈ, ఏఈ, ఒంటిమిట్ట చెరువు అలుగు, కట్టల పరిస్థితిని పరిశీలించారు. చెరువు నీటి విడుదలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, ఎస్వీ రమణ, వీరాంజనేయరెడ్డి, ఈశ్వరయ్య, శ్రీనివాసరెడ్డి, శివారెడ్డి, వెంకటరెడ్డి, సర్పంచ్ లక్ష్మి నర్సయ్య, నారాయణరెడ్డి,ఎంపిటిసి భాష, మౌలాలి మహిమ్,
చింతగింజల సుబ్రమణ్యం, బి. శ్రీనివాసులు, చంద్రపాల్, జయసింహారెడ్డి, రోశయ్య, నాగరాజా చంద్ర, శ్రీహరి, రాజారెడ్డి, అయవారయ్య, కట్ట సుబ్బరాయుడు వి వెంకటేష్, శివారెడ్డి,గపూర్ , రవిశంకర్ తో పాటు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చెరువు నిండుగా ఉండటంతో రాబోయే ఖరీఫ్, రబీ పంటలకు సాగునీటి సమస్య ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ శ్రేయస్సు, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ గంగమ్మకు హారతి ఇచ్చి కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా ముగించారు.