Vrm Media ప్రతినిధి రాంబాబు


ఏన్కూర్ నుంచి పల్లిపాడు ప్రయాణించే మార్గంలో జన్నారం గ్రామం తర్వాత ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది, పల్లిపాడు నుంచి కొత్తగూడెం భద్రాచలం పట్టణాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఈ మార్గం చాలా దగ్గరవుతుంది, కానీ వర్షాకాలం మాత్రం నీటి ప్రవాహం ఈ వంతెన పై ప్రవహిస్తూ ఉంటుంది, గతంలో వచ్చిన వరదల్లో ఒక వ్యక్తి డిసిఎం వ్యాన్ తో పాటు మునిగిపోవడం మనందరికీ విదితమే, అయినప్పటికీ అధికారులు ఇంతవరకు ప్రమాదాలు జరగకుండా, వంతెన చివరి భాగంలో ఎటువంటి ప్రమాద సూచికలు బోర్డులు, బ్యారికేడ్లు గానీ పెట్టలేదు, ఇంత జరిగిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండటం అనేది గమనార్హం, కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ వంతెనచివరి భాగంలో ప్రమాద సూచికలు ఏర్పాటు చేయవలసిందిగా స్థానికులు మరియు ప్రయాణికులు వాపోతున్నారు
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird