Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట–సిద్ధవటం మండలాలను కడపలోనే కొనసాగించాలి

ఒంటిమిట్ట–సిద్ధవటం మండలాలను కడపలోనే కొనసాగించాలి

by VRM Media
0 comments

రాజంపేట జిల్లా కేంద్రం చేయాలి
11వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

జేఏసీ కన్వీనర్ లాయర్ రామదాస్ అధ్యక్షతన

నరవకట్టపల్లి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పొట్టేటి రాజారెడ్డి ఆధ్వర్యంలో

VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట డిసెంబర్ 16

ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో నర్వకాటిపల్లి, గంగ పేరూరు పంచాయతీలకు చెందిన వరికుంట్ల యానాదయ్య, ఏ. వీరయ్య, బి. నాగరాజు, నరసింహులు, మామిడి మురళి, చరణ్, సురేష్,మ ల్లి చిన్న కొండయ్య. తదితరులు ఉద్యమానికి తమ మద్దతు తెలిపుతూ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా తీసుకునే పరిపాలనా నిర్ణయాలను సహించబోమని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ ఇంచార్జ్. తుమ్మల కుంట ఈశ్వరయ్య. తెలుగుదేశం పార్టీ మండల కో కన్వీనర్. కట్ట సుబ్బరాయుడు. తెలుగుదేశం పార్టీ మాజీ మండల ప్రధాన కార్యదర్శి కార్యదర్శి ప్రధాన బొబ్బిలి రాయుడు. తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి. నరువకట్టపల్లి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వెంకటసుబ్బయ్య.జేఏసీ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడులాయర్ రామదాసు, ఒంటిమిట్ట చెరువు చైర్మన్ పాటూరు గంగిరెడ్డి, రోశయ్య , పొట్టేటి రాజారెడ్డి, ఎమ్మెస్ వెంకట్ రెడ్డి, ఎం. వెంకటరెడ్డి, కత్తి చంద్ర , అజ్మతుల్లా సుబ్బరామయ్య, వెంకటేశు ,తదితర నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఒంటిమిట్ట.సిద్ధవటం మండలాల ప్రజల న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం గౌరవించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.

2,817 Views

You may also like

Leave a Comment