Home ఎంటర్‌టెయిన్మెంట్ చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్! – VRM MEDIA

చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్! – VRM MEDIA

by VRM Media
0 comments
చేతులు జోడించి అడుగుతున్నా.. శ్రీలీల ఎమోషనల్!



ఏఐ అనేది హీరోయిన్స్ పాలిట విలన్ గా మారుతోంది. ఏఐని కొందరు మంచిగా ఉపయోగిస్తూ అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు చెడుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్ల ఫేస్ తో అసభ్యమైన ఫేక్ ఫోటోలు, వీడియోలు జనరేట్ చేస్తున్నారు. ఇవి నిజమైనవని నమ్మేవారు కూడా ఉన్నారు. దీంతో హీరోయిన్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఈ ఫేక్ బారిన పడగా.. తాజాగా శ్రీలీల వంతు వచ్చింది. (శ్రీలీల)

ఎవరో ఆకతాయిలు ఏఐ ద్వారా శ్రీలీల ఫేక్ ఫోటోలు జనరేట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయం శ్రీలీల దృష్టికి వెళ్ళడంతో ఆమె స్పందించింది. అలాంటి వాటిని ప్రోత్సహించవద్దని కోరుతూ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: కామెడీ లేని రాజా సాబ్.. షాకిచ్చిన మారుతీ!

“ఏఐఐ ద్వారా జనరేట్ చేసే నాన్ సెన్స్ కి సపోర్ట్ చేయకూడదని ప్రతి సోషల్ మీడియా యూజర్ ని చేతులు జోడించి అడుగుతున్నాను. టెక్నాలజీని మంచికి ఉపయోగించాలి, చెడుకి కాదు. నా తోటి నటిమణులు కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటారు. ఈ విషయంలో ప్రేక్షకులు మాకు అండగా నిలవాలని కోరుకుంటున్నాను.” అంటూ శ్రీలీల ట్వీట్ చేసింది.

శ్రీలీల ట్వీట్ కి నెటిజెన్ల నుంచి మద్దతు లభిస్తోంది. ఏఐ వల్ల మహిళలు బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

2,807 Views

You may also like

Leave a Comment