క్రిస్మస్ సందర్భంగా 600 మంది క్రైస్తవ మహిళలకు ఉచితంగా పట్టు చీరలు పంపిణీ
తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామం సంజీవ్ నగర్ లో బీజేపీ దళిత యువత క్రిస్మస్ వేడుకలో భాగంగా క్రైస్తవ మహిళలకు
భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు బుధవారం రాత్రి ఉచితంగా పట్టు చీరలు పంపిణీ చేసారు.
తొలిత డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి కంబాల శ్రీనివాసరావు గారు పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు.
సంజీవ్ నగర్ ప్రజలు కంబాల శ్రీనివాసరావు గారికి, బాణసంచా కాల్పులతో, అడుగడుగునా పూలు జల్లుతూ, మహిళలు హరతులు పట్టి, ఘన స్వాగతం పలికారు. శాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.
అనంతరం క్రిస్మస్ వేడుకలో పాల్గొని, కొవ్వొత్తులు వెలిగించారు.
ఈ సందర్బంగా గర్భిణి స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. అనంతరం 600 మంది మహిళలకు పట్టు చీరలను కంబాల శ్రీనివాసరావు గారు ఉచితంగా పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,కార్యకర్తలు, దళిత యువత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.