Home ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్ ప్రేయర్ సెంటర్ నందు క్రిస్మస్ సంబరాలు

కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్ ప్రేయర్ సెంటర్ నందు క్రిస్మస్ సంబరాలు

by VRM Media
0 comments

నూతన వస్త్రాలు అందించి దైవజనులను సన్మానించిన అధ్యక్షులు పాస్టర్ విక్రమ్

ప్రత్తిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ డిసెంబర్18:–

కాకినాడ జిల్లా పత్తిపాడు కేంద్రం గా కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్ ప్రేయర్ సెంటర్ నందు పాస్టర్ విక్రమ్ అధ్యక్షతన 2025 క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగించారు. కమ్యూనిటీ అఫ్ క్రైస్ట్ సెంటర్ నందు మిషన్ ట్రైనింగ్ లో ఉన్న గృహిణులు శ్రద్ధ గా పాల్గొన్నారు. ప్రత్యేకమైన పాటలు వాక్యం అనంతరం క్యాండిల్స్ వెలిగించి కేక్ కటింగ్ అనంతరం పాస్టర్ విక్రమ్ వాక్యాన్ని చదివి యేసే లోక రక్షకుడని ప్రతి మానవాళిని పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చడానికి తన చివరి రక్తపు బొట్టు చిందించి మనకు పాప విమోచన ప్రసాదించాడని ప్రపంచంలో అనేక దేశాలు వారు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకుంటారని ప్రతి ఒక్కరు సత్యాన్ని గూర్చి అన్వేషణ చేయాలని అన్నారు. టీచర్స్ పుష్ప, టీచర్ వెంకటలక్ష్మి లు క్రిస్మస్ లో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానించబడిన దైవజనులు పాస్టర్ గంగరాజు, పాస్టర్ జాన్ మార్క్, దైవజనురాలు ద్వార్క ముగ్గురు హెచ్చరికల మాటలుగా క్రిస్మస్ సందేశాన్ని అందించారు అనంతరం అందరూ ప్రేమ విందు లో పాల్గొని క్రిస్మస్ ఆనందాన్ని పంచుకున్నారు

2,817 Views

You may also like

Leave a Comment