యువకుడి వైద్య ఖర్చులకు “కంబాల శ్రీనివాసరావు” లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం
VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం
తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన పెద్దపాటి శివ నాగేశ్వరావు అనే యువకుడికి లివర్ పాడైపోయింది, నోటి నుంచి రక్తం కారుతూ, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
కుటుంబ సభ్యులు వైద్య ఖర్చులకు కోసం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు రాయపాటి సత్యనారాయణ,యువత
విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురాగా,
స్పందించిన ఆయన ఇటీవలే నర్సాపురం గ్రామంలో యువకుడి ఇంటికి వెళ్లి అతనిని, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. తక్షణమే సహాయం కింద పదివేలు రూపాయలు ఆర్ధిక సహాయం చేసి, మెరుగైన వైద్య సేవల కోసం లక్ష రూపాయలు సహాయాన్ని ప్రకటించారు.
ఆ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చెక్ ను శుక్రవారం కణుపూరు గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువకుడు తండ్రి మల్లికార్జున రావుకి అందజేశారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు, యువత తదితరులు పాల్గొన్నారు..