Home Uncategorized వరంగల్ ఫోటోగ్రఫీ 50 సంవత్సరాల వేడుకలు – జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన గుడిమెట్ల నాగేంద్రబాబు (కార్తిక్)

వరంగల్ ఫోటోగ్రఫీ 50 సంవత్సరాల వేడుకలు – జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన గుడిమెట్ల నాగేంద్రబాబు (కార్తిక్)

by VRM Media
0 comments

VRM MEDIA ఖమ్మం ప్రతినిధి

వరంగల్ ఫోటోగ్రఫీ 50 సంవత్సరాల వేడుకలు – జాతీయ స్థాయి వర్క్‌షాప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన గుడిమెట్ల నాగేంద్రబాబు (కార్తిక్)
వరంగల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ 50 సంవత్సరాల వేడుకల సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి వర్క్‌షాప్లో గుడిమెట్ల నాగేంద్రబాబు (కార్తిక్) తన ప్రతిభను చాటుతూ బ్రాంజ్ మెడల్ సాధించడం గర్వకారణం.
ఈ విజయం వెనుక కేవలం వ్యక్తిగత కృషి మాత్రమే కాకుండా, సరైన మార్గదర్శకత్వం మరియు నిరంతర ప్రోత్సాహం కీలక పాత్ర పోషించాయి.
ఈ ప్రయాణంలో నన్ను ఒక అన్నయ్యలా పక్కన ఉండి, ఇప్పటికీ నాకు స్ఫూర్తిగా నిలుస్తున్న హుస్సేన్ ఖాన్ అన్నయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం, సూచనలు, మార్గనిర్దేశం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను.
ఫోటోగ్రఫీని కేవలం కెమెరాతో తీసే చిత్రంగా కాకుండా, ఒక కళగా, ఒక బాధ్యతగా చూడటం నేర్పిన హుస్సేన్ ఖాన్ అన్నయ్య ప్రభావం నా ప్రతి ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ బ్రాంజ్ మెడల్ నన్ను మరింత నిబద్ధతతో, మరింత అంకితభావంతో ఫోటోగ్రఫీ రంగంలో ముందుకు సాగేందుకు ప్రేరణగా నిలుస్తుంది.
– గుడిమెట్ల నాగేంద్రబాబు (కార్తిక్)
(బ్రాంజ్ మెడల్ విజేత)

2,807 Views

You may also like

Leave a Comment