Home Uncategorized కణుపూర్ గ్రామంలో ఏళ్లనాటి సమస్యను పరిష్కరించిన “కంబాల”….

కణుపూర్ గ్రామంలో ఏళ్లనాటి సమస్యను పరిష్కరించిన “కంబాల”….

by VRM Media
0 comments

VRM తెలుగు పత్రిక అయినవిల్లి భద్రం

స్మశాన వాటికకు 51,000 రూపాయలతో నూతనంగా బోర్..

  • తూర్పుగోదావరి జిల్లా, రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం కణుపూర్ గ్రామలోని స్మశాన వాటికకు 51,000 రూపాయల వ్యయంతో నూతనంగా బోర్ వేయించి, గ్రామస్తుల ఎన్నో ఏళ్ల నాటి సమస్యను
  • విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు పరిష్కరించారు.
  • కణుపూరు గ్రామంలో స్మశాన వాటికలో గత 30 ఏళ్ల నుంచి ప్రధానంగా వాటర్ సమస్య ఉంది.
  • గ్రామంలో ఎవరైనా చనిపోతే స్మశాన వాటికలో దహనం చేసిన, తరువాత స్నానాలు చేయడానికి, పలు కార్యక్రమాలకు వాటర్ సదుపాయం లేదు.
  • గ్రామస్తులు ఎన్నో ఏళ్లగా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఈ సమస్యలను కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి తీసుకురాగా స్పందించిన ఆయన 51,000 రూపాయల ఆర్ధిక సహాయాన్ని సోమవారం గ్రామస్తులకు అందజేసి, స్మశాన వాటికలో నూతనంగా బోర్ వేయించారు.
  • దీంతో గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు. గత 30 సంవత్సరాల నాటి తమ గ్రామ సమస్య పరిష్కరించిన కంబాల శ్రీనివాసరావు గారికి గ్రామస్తులు, మహిళలు, యువత, కృతజ్ఞతలు తెలిపారు.
2,813 Views

You may also like

Leave a Comment