కడప జిల్లాVRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ డిసెంబర్ 22
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత – శ్రీనివాసరెడ్డి చొరవ
సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమంలో భాగంగా, నిర్వహించిన భారీ ర్యాలీకి సంఘీభావం తెలిపిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు స్థానిక నాయకులు, జేఏసీ ప్రతినిధులు మరియు ప్రజలతో కలిసి కడప జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, సిద్ధవటం–ఒంటిమిట్ట మండలాలు భౌగోళికంగా, పరిపాలనా పరంగా కడప జిల్లాతోనే అనుసంధానమై ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ మండలాలను ఇతర జిల్లాల్లోకి మార్చడం వల్ల ప్రజలకు అనవసర ఇబ్బందులు ఎదురవుతాయని, దైనందిన అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు.
ప్రజల ఆకాంక్షలు, వాస్తవ పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యాలను గౌరవిస్తూ ఈ మండలాలు కడప జిల్లాలోనే కొనసాగించేలా ప్రభుత్వం స్థాయిలో సానుకూల నిర్ణయం రావాల్సిన అవసరాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజల న్యాయమైన డిమాండ్‌కు న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున అవసరమైన ప్రతినిధిత్వం కొనసాగిస్తామని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

