vrm media ప్రతినిధి



రెండు గంటల పాటు మైన్ లోపల విస్తృతంగా సమీక్ష
సత్తుపల్లి లోని జలగం వెంగళరావు (jvr) ఓపెన్ మైన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట వ్యూ పాయింట్ నుంచి మైన్ పరిశీలించిన డిప్యూటీ సీఎం తదుపరి మైన్ లోపలికి వెళ్లారు. ఓపెన్ మైన్ ను ఎలా ప్రారంభిస్తారు, ఎన్ని పొరలు ఉన్నాయి, మైన్ లో బొగ్గు ఎలా తీస్తారు, ఏ రకమైన బొగ్గు ప్రస్తుతం ఇక్కడ లభిస్తుంది, తీసిన బొగ్గును ఎలా బయటికి పంపిస్తారు, 24 గంటల పాటు మైన్ పనిచేస్తున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా కి సంబంధించి సౌకర్యాలు ఎలా ఉన్నాయి తదితర విషయాలను డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొత్తం వాహనాలు ఎన్ని వినియోగిస్తున్నారు, శాశ్వత సిబ్బంది, కాంట్రాక్టు సిబ్బంది ఎంతోమంది ఉన్నారు వారి వేతనాల చెల్లింపు ఏ లెక్కల్లో చేస్తారు అనే విషయాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మైన్ లో ఉత్పత్తి అవుతున్న బొగ్గుకు మార్కెట్లో ఏ ధర పలుకుతుంది, బొగ్గు తీసే క్రమంలో రవాణా నేపథ్యంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. మైన్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నేరుగా కోల్ డిస్పాచ్ సెంటర్ కు వెళ్లి అక్కడి నుంచి బొగ్గు ఎలా బయటికి వెళ్తుంది ఏ ఏ ప్రాంతాలకు వెళ్తుంది తదితర వివరాలను డిప్యూటీ సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం వెంట ఎమ్మెల్యే కట్ట రాగమయి, సిఎండి కృష్ణ భాస్కర్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, cp సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు.
VRM News 24 (C.E.O) Cell: 8332009797
Developed by Voice Bird